Telugu singer anjana sowmya biography sample

అంజనా సౌమ్య

Anjana sowmya
జన్మ నామంఅంజనా సౌమ్య
జననం (1985-09-29) 1985 సెప్టెంబరు 29 (వయసు 39)[1]
కాకినాడ
మూలంఆంధ్రప్రదేశ్
భారతదేశం
వృత్తిగాయని
క్రియాశీల కాలం2006-ఇప్పటివరకు

'అంజనా సౌమ్య' ఒక జానపద, సినీ గాయని.

విజయవంతమైన పలు చిత్రాలలో మధురమైన పాటలు పాడింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిర్వహించిన పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొని జూనియర్స్ రౌండ్‌లో రన్నర్ గా నిలిచింది. సూపర్ సింగర్ 4లో విజేతగా, సూపర్ సింగర్ 7లో విజేతగా నిలిచింది. సదార్చన, సాయి సౌమ్యలహరి1,2, అన్నమయ్య సంకీర్తనామృతం, టీ సీరిస్‌లో భక్తితో అంజన సౌమ్య వంటి ఆల్బమ్స్ చేసింది.సుమారు 60 సినిమాల్లో పాటలు పాడింది.

మలేషియా, సింగపూర్, జపాన్, అమెరికా తదితర దేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చింది.

నేపధ్యము

[మార్చు]

నాన్న గోపాలకృష్ణ, అమ్మ విద్యల సుమతి. ఈమెకు చిన్నప్పటినుంచే పాడాలని ఉన్న కోరిక సంగీతం వైపు నడిపించింది. కాకినాడలోఇంజనీరింగ్, విశాఖపట్నం గీతం విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేసింది. కాకినాడలోని సంగీతోపాధ్యాయులు కాకరపర్తి వీరభద్రరావు, పెద్దాడ సూర్యకుమారి వద్ద సంగీతం నేర్చుకున్నది.

సంగీతంలో డిప్లొమో చేసి ఆల్ ఇండియా లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించింది.

వివాహము

[మార్చు]

2011 లో అమెరికాకాలిఫోర్నియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న రావులపాలెం గ్రామానికి చెందిన రవితేజను పెళ్ళి చేసుకుంది.

సినిమా రంగం

[మార్చు]

ప్రధాన వ్యాసం: అంజనా సౌమ్య పాడిన తెలుగు సినిమా పాటల జాబితా

ఈమె క్లాస్‌మేట్స్‌, సరదాగా కాసేపు, క్షేత్రం, తిమ్మరాజు, ప్రేమ కావాలి, దేవరాయ, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, భీమవరం బుల్లోడు, ముకుంద, అ ఆ, బ్రహ్మోత్సవం, అరవింద సమేత వీర రాఘవ వంటి అనేక సినిమాలలో పాటలు పాడింది.

సి.నారాయణరెడ్డి, వేటూరి సుందరరామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, వనమాలి, భాస్కరభట్ల రవికుమార్, చంద్రబోస్, అనంత శ్రీరామ్, సుద్దాల అశోక్ తేజ, భువనచంద్ర మొదలైన సినీ గేయకవుల రచనలను కోటి, చక్రి, మణిశర్మ, అనూప్ రూబెన్స్, ఎస్. ఎ. రాజ్‌కుమార్ఎస్.ఎస్.

Dr parviz ghadirian biography of christopher

తమన్,మిక్కీ జె. మేయర్హరిహరన్, రఘు కుంచే, రమణ గోగుల వంటి సంగీత దర్శకుల నేతృత్వంలో మల్లికార్జున్, శ్రీకృష్ణ, కార్తీక్, మాళవిక, టిప్పు, ఉదిత్ నారాయణ్, శ్వేత మోహన్, అనుదీప్ దేవ్, కె.ఎస్.చిత్ర, రమ్య బెహరా, దలేర్ మెహంది మొదలైన గాయనీ గాయకులతో కలిసి ఆలపించింది.

మూలాలు

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]